Dhanush: సర్వైవల్‌ థ్రిల్లర్ డ్రామాగా 'కర'

ABN, Publish Date - Apr 20 , 2026 | 05:06 PM

తమిళ స్టార్ హీరో ధనుష్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కర'. ఈ సర్వైవల్‌ థ్రిల్లర్ మూవీలో మమిత బైజు హీరోయిన్‌. విఘ్నేష్‌ రాజా దర్శకత్వంలో వేల్‌ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఏప్రిల్ 30న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

'కర' ప్రచార చిత్రం ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. గల్ఫ్‌ యుద్థసమయంలో రామనాథపురం నేపథ్యంలో సాగే కథ ఇది. తగినంత చమురు లభించకపోవడంతో పెట్రోల్‌ బంకుల్ని మూసివేస్తారు. ఇంధన కొరత సమస్య సామాన్యుల మీద కూడా పడుతుంది. దొంగగా జీవితాన్ని ప్రారంభంచిన కర... ఆ తర్వాత సాధారణ జీవితాన్ని గడపాలని భావించినా... పరిస్థితులు అందుకు సహకరించవు. గతంలో చేసిన బ్యాంక్‌ చోరి అతన్ని వెంటాడుతూనే ఉంటుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్‌ చేసే పోలీస్‌ అధికారి కర ను వెంటాడుతూ ఉంటాడు. కరగా ధనుష్‌ నటించగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రను ప్రముఖ మలయాళ నటుడు సూరజ్ వెంజరమూడు చేశాడు. ఇప్పటికే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సినిమాకు జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతాన్ని అందించాడు.

Updated at - Apr 20 , 2026 | 05:24 PM