సిగ్మాలో కేథరిన్ ఐటమ్ సాంగ్!
ABN, Publish Date - Sep 26 , 2026 | 04:46 PM
సందీప్ కిషన్ 'సిగ్మా' మూవీతో కేథరిన్ ధ్రెసా ఐటమ్ సాంగ్‌లో నర్తించింది. ఈ పాటకు తమన్ స్వరాలు సమకూర్చారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 'జయ జానకీ నాయక'లో ఐటమ్ సాంగ్‌లో నర్తించిన కేథరిన్ ధ్రెసా ఇప్పుడు మరోసారి ఐటమ్ గర్ల్ అవతారమెత్తింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తెరకెక్కించిన 'సిగ్మా' సినిమాలో కేథరిన్ ఐటమ్ సాంగ్‌లో నర్తించింది.
సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న 'సిగ్మా'లో రాజు సుందరం, సంపత్ రాజ్, శివ పండిట్, అన్బూధాసన్, యోగ్ జపీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై ఈ సినిమాను సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. 'సూళ్ళూరి సులోచన.. స్వర్గాల అంచుల్ని చూపించనా...' అంటూ సాగే ఈ ఐటమ్ సాగ్ ను కృష్ణ చైతన్య రాయగా, తమన్ స్వరపర్చారు. శ్రుతీ రంజనీ పాడారు. కళ్యాణ్ కొరియోగ్రఫీ అందించారు. 'సిగ్మా' సినిమా తమిళ, తెలుగు భాషల్లో అక్టోబర్ 2న విడుదల కాబోతోంది.
ఇవి కూడా చదవండి:
Divyabharathi: ఒరేయ్.. బికినీ ఫోటోలు నిజమనుకున్నారు కదరా..
నానికే ఈ రేంజ్ లో ఉంటే.. దేవరకొండ పరిస్థితి ఏంటో
ప్యారడైజ్ ఎఫెక్ట్.. ఆగిపోయిన చిరు- శ్రీకాంత్ ఓదెల సినిమా
Updated at - Sep 26 , 2026 | 05:27 PM