Crazy Kalyanam: సరదా సరదాగా ‘క్రేజీ కళ్యాణం’ టీజర్
ABN, Publish Date - Aug 01 , 2026 | 02:13 PM
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలక పాత్రలు పోషిస్తున్న వినోదాత్మక చిత్రం ‘క్రేజీ కళ్యాణం’.
అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్, నరేష్ వీకే కీలక పాత్రలు పోషిస్తున్న వినోదాత్మక చిత్రం ‘క్రేజీ కళ్యాణం’. బద్రప్ప గాజుల దర్శకత్వం వహించిన ఈ సినిమాను బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. అనుపమ పరమేశ్వరన్ సహజ నటనతో ఆకట్టుకోగా, తరుణ్ భాస్కర్ తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో వినోదాన్ని పంచనున్నట్లు టీజర్‌లో కనిపిస్తోంది. సురేశ్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.
Updated at - Aug 01 , 2026 | 02:15 PM