Alias Rukmini: ఈసారి నితిన్ గట్టిగానే కొట్టేట్టున్నాడుగా!

ABN, Publish Date - Nov 26 , 2026 | 07:01 PM

నితిన్, ఆఫియా సయ్యద్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘అలియాస్ రుక్మిణి’ ట్రైలర్ విడుదలైంది. రొమాన్స్, హ్యూమర్, భావోద్వేగాలతో ఆకట్టుకుంటున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలోకి రానుంది.

నితిన్‌, ఆఫియా సయ్యద్, సాయి కుమార్, హర్షవర్ధన్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'అలియాస్‌ రుక్మిణి'. నాని సమర్పణలో దీప్తి గంట నిర్మించిన ఈ సినిమాను ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ తెరకెక్కించారు. రొమాన్స్, హ్యూమర్ కలగలిసిన ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. విజయ్‌ బుల్గానిన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జోమోన్ టి. జాన్ సినిమాటోగ్రఫీ సమకూర్చుతున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, సృజన ఆదుసుమిల్లి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 4న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. కలం పేరుతో శృంగార నవలలు రాసే ఓ యువకుడికి పెళ్ళైన తర్వాత ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమౌతోంది. ముఖ్యంగా ట్రైలర్ చివరిలో నితిన్‌ పండించిన భావోద్వేగాలను గమనిస్తే... నటుడిగా మరోసారి తన సత్తాను చాటుకున్నట్టు అర్థమౌతోంది.

ఇవి కూడా చదవండి:

Ramayanam: రామాయణం.. అమిత్ షా ఏమన్నారంటే?

ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?

నంది అవార్డుల కమిటీల ఏర్పాటు.. స్పెషల్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా బాలకృష్ణ

Updated at - Nov 26 , 2026 | 07:05 PM