నాని వదిలిన 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ టీజర్..

ABN, Publish Date - Jul 03 , 2026 | 10:16 PM

కన్నడ పరిశ్రమలో విభిన్నమైన మరియు బలమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ హేమంత్ ఎమ్ రావు దర్శకత్వంలో, కరునాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్‌కుమార్ (Shivaraj Kumar) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ (666 Operation Dream Theatre).

కన్నడ పరిశ్రమలో విభిన్నమైన మరియు బలమైన కథాంశాలతో సినిమాలు తీస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ హేమంత్ ఎమ్ రావు దర్శకత్వంలో, కరునాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్‌కుమార్ (Shivaraj Kumar) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ 666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్ (666 Operation Dream Theatre). వైశాఖ్ జె ఫిల్మ్స్ బ్యానర్‌పై వైశాఖ్ జె గౌడ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో శివరాజ్‌కుమార్‌తో పాటు టాలెంటెడ్ యాక్టర్ డాలీ ధనంజయ్, స్టార్ హీరోయిన్ ప్రియాంకా అరుళ్ మోహన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్ ని న్యాచురల్ స్టార్ నాని రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ తెలిపాడు. టీజర్ ని బట్టి ఈ సినిమాను 1970 లేదా 80ల నాటి పాతకాలపు బ్యాక్‌డ్రాప్‌లో ఎంతో రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్‌తో రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఏజెంట్ ప్రకాష్ అనే ఒక పవర్‌ఫుల్ ఆపరేషన్ లేదా ఇన్వెస్టిగేటివ్ మిషన్ చుట్టూ ఈ కథ తిరగబోతున్నట్లు టీజర్ లోని డైలాగ్స్ హింట్ ఇస్తున్నాయి.

Updated at - Jul 03 , 2026 | 10:23 PM