Geetu Mohandas: ‘టాక్సిక్‌’తో నా సత్తా చూపించా.. భావోద్వేగానికి గురైన దర్శకురాలు

ABN , Publish Date - Aug 09 , 2026 | 01:06 PM

‘టాక్సిక్‌’ సినిమా ప్రారంభించినప్పుడు చాలా మంది ‘నీ వల్ల కాదు’ అన్నారు.  అలాంటివాళ్లకు సినిమా పూర్తి చేసి నా సత్తా చూపించాను' అని దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌  అన్నారు.

‘టాక్సిక్‌’ సినిమా ప్రారంభించినప్పుడు చాలా మంది ‘నీ వల్ల కాదు’ అన్నారు.  అలాంటివాళ్లకు సినిమా పూర్తి చేసి నా సత్తా చూపించాను' అని దర్శకురాలు గీతూ మోహన్‌ దాస్‌  అన్నారు. ఆమె దర్శకత్వంలో యశ్‌ హీరోగా తెరకెక్కిన ‘టాక్సిక్’ ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. శనివారం బెంగళూరులో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ వేదికపై దర్శకురాలు మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సినిమా ప్రారంభించినపుడు చాలా మంది ఎన్నో మాటలు అన్నారు. తనపై నమ్మకం ఉంచి.. ఈ సినిమాను అంగీకరించినందుకు యశ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నిర్మాత కేవీఎన్ నాపై పెట్టిన నమ్మకం వల్లే ఈ సినిమా సాధ్యమైంది. మా కోసం ఎక్కడా రాజీ పడకుండా అన్ని సమకూర్చారు. ఈ జర్నీని నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను' అన్నారు 

Updated Date - Aug 09 , 2026 | 01:41 PM