విడుదలైన టొవినో థామస్‌ 'పళ్ళిచట్టంబి' టీజర్

ABN, Publish Date - Mar 23 , 2026 | 12:46 PM

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ ప్రెస్టీజియస్ మూవీ 'పళ్ళిచట్టంబి'. ఏప్రిల్‌ 10న ఈ సినిమా మలయాళంతో పాటు ఇతర నాలుగు భారతీయ భాషల్లోనూ విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు. పిశాచి శక్తి, దైవ భక్తి మధ్య సాగే కథ ఇదని ఈ టీజర్ చూస్తుంటే అర్థమౌతోంది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మిస్తున్నారు. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో కయదు లోహర్ హీరోయిన్. 50, 60 దశకాల నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్ మూవీలో హీరో టొవినో థామస్ ఇప్పటిదాకా చూడని విధంగా సరికొత్తగా కనిపించనున్నారు.

Updated at - Mar 23 , 2026 | 02:33 PM