ముగ్గురు కోతులు.. ‘తిడుతున్నా కొడుతున్నా’ సాంగ్

ABN, Publish Date - Sep 05 , 2026 | 05:14 PM

తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కీలక పాత్రధారులుగా  వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’.

తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ కీలక పాత్రధారులుగా వర్షిక పాశం హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘ముగ్గురు కోతులు’ (mugguru kothulu).  శోభారాణి గరిమెల్ల నిర్మాణంలో కార్తీక్ గరిమెల్ల తెరకెక్కించిన చిత్రమిది.  తాజాగా ఈ సినిమా నుంచి ఓ ప్రేమ గీతాన్ని విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఈ చిత్రం నుంచి ‘తిడుతున్నా కొడుతున్నా’ అనే పాటను రిలీజ్ చేశారు.  ఎస్. సుహాస్ బాణీ, జగదీష్ సాహిత్యంతో పాటుగా చైతన్య, లాస్య గాత్రం ఈ పాటను వినసొంపుగా మార్చాయి. ప్రస్తుతం  షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  

Updated at - Sep 05 , 2026 | 05:21 PM