శ్రీ విష్ణు.. విష్ణు విన్యాసం టీజర్
ABN, Publish Date - Feb 18 , 2026 | 07:31 PM
యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీ విష్ణు నటించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’.
యదునాథ్ మారుతీరావు దర్శకత్వంలో శ్రీ విష్ణు నటించిన చిత్రం ‘విష్ణు విన్యాసం’. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయన్ సారిక కథానాయిక. ఈ మూవీ ఇదే నెల 28న ప్రేక్షకుల ఎదుటకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.
టీజర్ చూస్తే ఆసాంతం నవ్వులతో ముంచెత్తినట్టుగా ఉంది. ఎప్పటిలానే శ్రీ విష్ణు సినిమాల మాదిరి కాన్సెప్ట్‌తో ఈ చిత్రం రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేగాక హీరోయిన్ క్యారెక్టర్ కు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు కనిపిస్తోంది. ఆమెతో మందు తాగించడం వంటి సన్నివేశాలు కుర్రకారుని ఆకట్టుకునేలా సాగాయి. మీరూ ఈ టీజర్‌పై ఓ లుక్కేయండి.
Updated at - Feb 19 , 2026 | 02:18 PM