ఎన్టీఆర్‌ ఆవిష్కరించిన 'మృత్యుంజయ్‌' ట్రైలర్

ABN, Publish Date - Feb 28 , 2026 | 03:02 PM

ది కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు (Srivishnu) హీరోగా హుస్సేన్ షా కిరణ్ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’ (Mruthunjay). ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను లైట్‌బాక్స్ మీడియా, పిక్చర్ పర్ఫెక్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై సందీప్ గుణ్ణం, వినయ్ చిలకపాటి సంయుక్తంగా నిర్మించారు. ‘సామజవరగమన’ (Samajavaragamana) తో బ్లాక్‌బస్టర్ హిట్ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ చిత్రాన్ని మార్చి 6న భారీ ఎత్తున రిలీజ్ చేయబోతోన్నారు. ఫిబ్రవరి 28 శ్రీవిష్ణు పుట్టిన రోజు సందర్భంగా 'మృత్యుంజయ్‌' ట్రైలర్‌ను జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన సందీప్ గుణ్ణంతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలియచేశాడు. తండ్రి గుణ్ణం గంగరాజులానే సందీప్ కూడా యూనిక్‌ కథలను ఎంపిక చేసుకుంటాడని కితాబిచ్చాడు. తాజాగా విడుదలైన 'మృత్యుంజయ్‌' ట్రైలర్‌ చూస్తే... అందులో వాస్తవం ఉందని అనిపిస్తోంది. గత శుక్రవారం శ్రీవిష్ణు నటించిన 'విష్ణు విన్యాసం' విడుదల కాగా రాబోయే శుక్రవారం 'మృత్యుంజయ్‌' జనం ముందుకు రాబోతోంది.

Updated at - Feb 28 , 2026 | 03:02 PM