విష్ణు విన్యాసం టీమ్ నుండి వాలెంటైన్స్ డే కానుక!
ABN, Publish Date - Feb 13 , 2026 | 07:32 PM
'విష్ణు విన్యాసం' నుంచి 'మొదలే మొదలే' సాంగ్ రిలీజ్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం' అనే చిత్రంలో నటిస్తున్నాడు. యదునాథ్ మారుతి రావు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సుమంత్ నాయుడు నిర్మించిన ఈ చిత్రానికి హేమ, షాలిని సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం మేకర్స్ సెకండ్ సింగిల్ 'మొదలే మొదలే' సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు రధన్ ఈ పాటను స్వరపరచగా, రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చారు. మధుశ్రీ, నరేష్ అయ్యర్ దీనిని ఆలపించారు. ఈ పాటను శ్రీవిష్ణు, నయన సారికపై చిత్రీకరించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ పాటను విడుదల చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.
Updated at - Feb 13 , 2026 | 07:33 PM