Roshan Meka: ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Sep 29 , 2026 | 12:09 PM
రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న ‘ఎమో ఎమో ఇది’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు.
రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఎమో ఎమో ఇది’. డా. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. తాజాగా ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో సున్నితమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యంతో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ప్రేమానుభూతిని పంచుతుంది. రోషన్ మేకా, ప్రీతి ముఖుందన్ మధ్య కనిపించే కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా, కార్తీక్, రమ్య బెహరా తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ ఎస్, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. అక్టోబర్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.
Updated at - Sep 29 , 2026 | 12:26 PM