'సన్ ఆఫ్' నుంచి.. రొమాంటిక్ లవ్ సాంగ్
ABN , Publish Date - Feb 19 , 2026 | 07:16 PM
సాయి సింహాద్రి హీరోగా బత్తుల సతీశ్ దర్శకత్వం వహించిన సినిమా 'సన్ ఆఫ్'.
సాయి సింహాద్రి (Sai Simhadri) హీరోగా నటించి నిర్మించిన సినిమా 'సన్ ఆఫ్' (Son Of). బత్తుల సతీశ్ (Bathala Sateesh) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 27న విడుదల కాబోతోంది. మీరా రాజ్ (Meera Raaj) కథానాయిక. వినోద్ కుమార్ (Vinod Kumar), వాసు ఇంటూరి (Vasu Inturi) ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పాటలు, ట్రైలర్‌మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి ఊసులాడే (Oosulade Lyrical Video) అంటూ సాగే రొమాంటిక్ లవ్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలకు భాస్కరబట్ల సాహిత్యం అందించగా రిషి సంగీత దర్శకత్వంలో ఆదిత్య ఆర్కే ( Aditya Rk), సమీరా భరద్వాజ్(Sameera Bharadwaj) ఆలపించారు.