Rashmika Mandanna: యాక్షన్‌ అవతార్‌ కోసం రష్మిక ఎంత కష్టపడిందో చూశారా?

ABN, Publish Date - Nov 19 , 2026 | 10:28 AM

రష్మిక ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మైసా’ (Mysaa). ఈ సినిమా కోసం రష్మిక తీసుకున్న కఠినమైన శిక్షణకు సంబంధించిన వివరాలను ఓ ప్రత్యేక వీడియో ద్వారా మేకర్స్‌ విడుదల చేశారు.

రష్మిక ప్రధాన పాత్రలో రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘మైసా’ (Mysaa). ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా చిత్రబృందం ఓ ప్రత్యేక వీడియోను పంచుకుంది. ఈ సినిమా కోసం రష్మిక తీసుకున్న కఠినమైన శిక్షణ వివరాలను అందులో చూపించారు. బ్యాంకాక్‌లో రోజుకు 10 గంటల పాటు శిక్షణ తీసుకున్నట్లు రష్మిక వెల్లడించారు. ఈ సినిమాలో ఆమె మునుపెన్నడూ కనిపించని యాక్షన్‌ అవతార్‌లో ప్రేక్షకులను అలరించనున్నారు. తన పాత్రకు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యేందుకు మార్షల్‌ ఆర్ట్స్‌తో పాటు ప్రత్యేకమైన ఫిజికల్‌ ట్రైనింగ్‌ తీసుకున్నారట. శారీరకంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఈ పాత్ర కోసం ఎంతో శ్రమించినట్లు రష్మిక వీడియోలో వివరించారు. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా ‘మైసా’లో కనిపించనుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతోంది. తాజాగా విడుదలైన ఈ శిక్షణ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Updated at - Nov 19 , 2026 | 11:39 AM