Korean Kanakaraju: ‘రాసా గుమ్మాడి’ వరుణ్ - దక్ష నగార్కర్‌ల మాస్ జాతర
ABN, Publish Date - Jul 20 , 2026 | 02:45 PM
'కొరియన్ కనకరాజు' లో వరుణ్ తేజ్ - దక్ష నగార్కర్‌పై చిత్రీకరించిన 'రాసా గుమ్మాడి’ అంటూ రాయలసీమ జాతర నేపథ్యంలో సాగే పాటను విడుదల చేశారు మేకర్స్.
వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'కొరియన్ కనకరాజు'. సత్య కీలక పాత్ర పోషించారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమా ఆగస్టు 7న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి సెకండ్ లిరికల్ వీడియోను విడుదల చేశారు.
‘రాసా గుమ్మాడి’ అంటూ రాయలసీమ జాతర నేపథ్యంలో సాగే ఈ మాస్ పాటకు వరుణ్ - దక్ష నగార్కర్ వేసిన మాస్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. తమన్ సంగీత సారధ్యంలో నల్గొండ గద్దర్
నర్సన్న ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు.
Updated at - Jul 20 , 2026 | 03:12 PM