‘రాకాస’ నుంచి ‘రపప్పా.. రపప్పా’ పాట విడుదల
ABN, Publish Date - Mar 08 , 2026 | 08:23 PM
సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘రాకాస’. మానస శర్మ దర్శకురాలు. ఏప్రిల్ 3న సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ‘రపప్పా.. రపప్పా’ అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. అనుదీప్ దేవ్ అందించిన బాణీ, రఘురాం సాహిత్యం, రామ్ మిర్యాల గాత్రం ఈ పాటను మరింత స్పెషల్‌గా మార్చేశాయి. ఈ మూవీ ఆడియో హక్కుల్ని సరిగమ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమాని ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్, కెనడాలో ప్రత్యంగిరా సినిమాస్ భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నాయి.
Updated at - Mar 09 , 2026 | 11:52 AM