విరోష్ ప్రేమకు రణబాలి టీమ్ చిరు కానుక!
ABN, Publish Date - Feb 28 , 2026 | 12:19 PM
స్టార్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda), నేషనల్ క్రష్ రశ్మిక మందణ్ణ (Rashmika Mandanna) గురువారం పెళ్లి పీటలెక్కేశారు. సన్నిహితుల సమక్షంలో వారి వివాహం ఘనంగా జరిగింది. మార్చి 4వ తేదీ ఇవ్వబోతున్న మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాట్లు మరో పక్క జరుగుతున్నాయి. ఈ సమయంలో వీరిద్దరూ జంటగా నటిస్తున్న 'రణబాలి' (Ranabaali) మూవీ టీమ్ ఓ స్పెషల్ సర్ ప్రైజ్ గిఫ్ట్‌ను అందించింది. ఈ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించి పెళ్ళిపాటలోని సన్నివేశాలను చిన్నపాటి గ్లింప్స్‌గా విడుదల చేసింది. ఈ వీడియోను చూస్తుంటే మొన్నటి పెళ్ళిఫోటోలే కళ్ళలో మెదలడం విశేషం. 'రణబాలి' సినిమాను రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సంస్థ విజయ్ దేవరకొండ, రశ్మిక జంటగా గతంలో 'డియర్ కామ్రేడ్' మూవీని నిర్మించింది.

Updated at - Feb 28 , 2026 | 01:51 PM