Raghu Teaser: సుమన్ చేతుల మీదుగా ‘రఘు’ టీజర్

ABN, Publish Date - Jan 26 , 2026 | 07:21 PM

మహేష్ తారక్, మహేష్ కోట, కరిష్మా, కీలక పాత్రధారులుగా శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ సాయి కృష్ణ నిర్మిస్తున్న  చిత్రం 'రఘు'. కె. సాయి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ  సినిమా టీజర్‌ను సుమన్   ఆవిష్కరించారు.  సుమన్ గారు మాట్లాడుతూ 'రఘు' సినిమా టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు సాయి కిషోర్ టేకింగ్, నిర్మాతలు రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించిన విధానం టీజర్‌లో కనిపిస్తోంది. కొత్త వాళ్ళను ప్రోత్సహిస్తున్న చిత్ర యూనిట్ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అని అన్నారు. నిర్మాత తల్లాడ సాయి కృష్ణ మాట్లాడుతూ  'సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము' అని తెలిపారు

Updated at - Jan 26 , 2026 | 07:21 PM