Anumana Pakshi: రాగ్ మయూర్.. అనుమాన పక్షి టీజర్
ABN , Publish Date - Jun 09 , 2026 | 12:20 PM
సినిమా బండి ఫేమ్ రాగ్ మయూర్ (Rag Mayur) హీరోగా డీజే టిల్లు ఫేం విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనుమాన పక్షి.
సినిమా బండి ఫేమ్ రాగ్ మయూర్ (Rag Mayur) హీరోగా డీజే టిల్లు ఫేం విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అనుమాన పక్షి. మెర్లీన్ ఫిలిప్ (Merin Philip) హీరోయిన్. సీనియనర్ నటి రాశి (Raasi), విక్రమార్కుడు అజయ్, బ్రహ్మాజీ, ప్రిన్స్ సెసిల్, అనన్య, చరిత్, సదన్న కీలక పాత్రలు పోషించారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 10న విడుదలకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పొస్టర్స్, గ్లింప్స్, పాటలు సినిమాపై అంచనాలను క్రియేట్ చేశాయి. ఈ క్రమంలో తాజాగా మంగళవారం ఈ మూవీ టీజర్ విడుదదల చేశారు. లేచిన దగ్గరి నుంచి దగ్గినా, తుమ్మినా ప్రతి దానిని అనుమానించే ఓ యూట్యూబర్ చుట్టూ తిరిగే కథగా ఈ మూవీ టీజర్ చూస్తే తెలుస్తుంది.
ప్రతి విషయం నెగిటివ్‌గా అలోచించే అతని జీవితంలో ఎలాంటి ఘటనలు జరిగాయి, అతని ద్వారా ఇతరులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనే ఆసక్తికరమైన కథనంతో సినిమా ఔట్ అండ్ ఔట్ హస్య ప్రధానంగా సినిమాసాగినట్లు తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ టీజర్‌పై ఓ లుక్ వేయండి,