ఆసక్తికరంగా ‘తాయ్ కిళవి’ ట్రైలర్
ABN, Publish Date - Feb 23 , 2026 | 07:51 PM
రాధికా శరత్‌కుమార్ కీలక పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi). ఇందులో రాధిక వృద్ధురాలి పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె లుక్ ఆకట్టుకుంది. శివకుమార్ మురుగేశన్ దర్శకుడు. హీరో శివ కార్తికేయన్ నిర్మాత. సింగమ్ పులి, అరుళ్ దాస్, బాల శరవణన్, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 27న తమిళంలో విడుదల కానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది.
Updated at - Feb 24 , 2026 | 11:11 AM