Chiranjeevi: నా బిడ్డ చరణ్‌ని చూస్తే గర్వంగా ఉంది.. ఇదే పుత్రోత్సాహం అంటే..
ABN, Publish Date - Jun 13 , 2026 | 09:02 PM
‘రామ్‌చరణ్ (Ram charan) పనితీరు, డెడికేషన్ గురించి నాకు తెలుసు. దానికి గురించి నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు. నా బిడ్డ గురించి ప్రేక్షకులు మాట్లాడేశారు.
‘రామ్‌చరణ్ (Ram charan) పనితీరు, డెడికేషన్ గురించి నాకు తెలుసు. దానికి గురించి నేను ఎక్కువ మాట్లాడితే బాగోదు. నా బిడ్డ గురించి ప్రేక్షకులు మాట్లాడేశారు. నేషనల్ అవార్డును మించిన సంతృప్తిని చరణ్ ఇచ్చాడు. తండ్రిగా తనని చూసి ఎప్పుడూ గర్వపడతాను. ‘పెద్ది’తో తన నటనతో నా మనసును పిండేశాడు. పుత్రోత్సాహం అన్నది మరోసారి నాకు కలిగింది’ అని చిరంజీవి (Chiranjeevi) అన్నారు. రామ్‌చరణ్ నటించిన ‘పెది’్ద సినిమా చూసిన తర్వాత దర్శకుడు, సానా బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీశ్‌తో సరదాగా ముచ్చటించారు చిరు. ‘ఆస్పత్రి సీన్‌లో చరణ్ నటించలేదు. ఆ పాత్రలోకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి చివరి వరకూ నా కంట్లో నీరు ఆగలేదు. నటనతో కట్టిపడేశాడు’ అని చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.
‘ఆస్పత్రి సీన్ చరణ్ నటన చూసిన ఆడియన్స్ ‘చరణ్‌జీవి’ అంటున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు వస్తే అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదు’ అని దర్శకుడు బుచ్చిబాబు అన్నారు.
ఈ పూర్తి ఇంటర్వ్యూను మీరూ చూసేయండి...
Updated at - Jun 13 , 2026 | 09:29 PM