Seetha Payanam Song: పయనమే అంటూ.. మెలోడీగా సాగుతూ..
ABN, Publish Date - Jan 31 , 2026 | 02:17 PM
నటుడు, దర్శకుడు యాక్షన్ కింగ్ అర్జున్ దర్శకత్వంలో రాబోతోన్న కొత్త చిత్రం 'సీతా పయనం'. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ హీరోయిన్‌గా తెరకు పరిచయం కాబోతోన్నారు. అర్జున్ కూడా ప్రత్యేకమైన పాత్రలో నటించారు. అతని మేనల్లుడు యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా మరో స్పెషల్ కామియో రోల్ పోషించారు. ఈ మూవీని ఫిబ్రవరి 14న రిలీజ్ చేయబోతోన్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ చిత్రం నుంచి ‘పయనమే’ పాటను చిత్ర బృందం విడుదల చేసింది. కాసర్ల శ్యాం రచించగా, అనూప్ రూబెన్స్ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు.
Updated at - Jan 31 , 2026 | 03:40 PM