Om Bam Bhole Song: మహా శివరాత్రి ..‘ఓం భం భోలే’ వీడియో సాంగ్
ABN, Publish Date - Feb 16 , 2026 | 10:46 AM
మహాశివరాత్రి సందర్భంగా ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఓ భక్తిరస గీతం ‘ఓం భం భోలే’ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
మహాశివరాత్రి సందర్భంగా ఇటీవల యూట్యూబ్‌లో విడుదలైన ఓ భక్తిరస గీతం ‘ఓం భం భోలే’ భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అకీ క్రియేటివ్ వర్క్స్ నిర్మించిన ఈ భక్తి పాటకు నాగేంద్ర ఇనమడుగు స్వయంగా సాహిత్యం అందించడంతో పాటు దర్వకత్వం వహించారు.
పాటలో శివ భక్తులుగా నాగేంద్ర ఇనమడుగు, అనిల్ ఇనమడుగు, అజయ్ ఇనమడుగు, అజయ్ సన్నపు, మరియు అజాస్ జాన్ శివ నటించారు. మార్క్ ప్రశాంత్ సంగీతం అందించారు. మహాశివరాత్రి కానుకగా వచ్చిన ఈ పాట ప్రస్తుతం భక్తుల ప్లేలిస్ట్‌లలో చోటు సంపాదిస్తూ మంచి ఆదరణ పొందుతోంది.
Updated at - Feb 16 , 2026 | 12:56 PM