ధురంద‌ర్ నుంచి.. తెలుగు పాట‌ వ‌చ్చేసింది

ABN , Publish Date - Feb 19 , 2026 | 08:08 PM

ర‌ణ్ వీర్ సింగ్ క‌థానాయ‌కుడిగా గ‌తేడాది చివ‌ర‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద సునామీ సృష్టించిన చిత్రం ధురంద‌ర్.

Dhurandhar

ర‌ణ్ వీర్ సింగ్ (Ranveer Singh) క‌థానాయ‌కుడిగా గ‌తేడాది చివ‌ర‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి బాక్సాఫీస్ వ‌ద్ద సునామీ సృష్టించిన చిత్రం ధురంద‌ర్ (Dhurandhar). ఆదిత్య ధర్ (Aditya Dhar) స్వీయ ద‌ర్శ‌క నిర్మాణంలో వ‌చ్చిన ఈ మూవీ ప్ర‌పంచ వ్యాప్తంగా రూ. వెయ్యి కోట్ల‌కు పైగా వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇటీవ‌ల ఇత‌ర భాష‌ల్లోనూ ఓటీటీకి వ‌చ్చి రికార్డులు తిర‌గరాస్తోంది. కాగా రానున్న‌ మార్చిలో ఈ చిత్రం రెండో భాగం హిందీతో పాటు తెలుగు ఇత‌ర భాష‌ల్లోనూ థియేట‌ర్ల‌కు రానుంది.

అయితే.. ఈ సినిమా ఫ‌స్ట్ పార్ట్ నుంచి హీరో పాకిస్తాన్‌లోకి ఎంట్రీ ఇచ్చే స‌మ‌యంలో బ్యాగ్రౌండ్‌లో వ‌చ్చే పాట తెలుగు వ‌ర్ష‌న్ ఒక తీర‌మే (Oka Theerame) అంటూ సాగే గీతాన్ని విడుద‌ల చేశారు. క్రిష్ణ‌కాంత్ (Krishna Kanth) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా శాశ్వత్ సచ్‌దేవ్ (Shashwat Sachdev) సంగీతంలో హ‌రిచ‌ర‌ణ్ (Haricharan) ఆల‌పించాడు. ప్ర‌స్తుతం ఈపాట యూట్యూబ్‌లో వైర‌ల్ అవుతోంది.

Updated Date - Feb 19 , 2026 | 08:08 PM