తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయన్ దంపతులు
ABN, Publish Date - Apr 09 , 2026 | 01:38 PM
నయనతార, విఘ్నేశ్ శివన్ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 1 ద్వారా ఆలయంలోకి వెళ్లిన ఈ జంట.. సప్తగిరీశుడిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వారికి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం బయట, మాడ వీధుల్లో నయనతారతో ఫొటోలు దిగేందుకు ఫాన్స్ ఎగబడ్డారు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వం వహించిన 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Updated at - Apr 09 , 2026 | 01:44 PM