Nani: సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్న నాని...

ABN, Publish Date - Sep 29 , 2026 | 03:45 PM

మేడారంలోని వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంది.

మేడారంలోని వన దేవతలు సమ్మక్క-సారలమ్మలను ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం భక్తి శ్రద్ధలతో దర్శించుకుంది. నాని, సంపూర్ణేష్ బాబుతో పాటు చిత్ర బృందం మేడారం చేరుకున్నారు. వారికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నాని వనదేవతల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు చిత్ర బృందానికి అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. నాని మేడారం వచ్చిన విషయం తెలుసుకున్న అభిమానులు భారీ  సంఖ్యలో ఆలయ ప్రాంగణానికి చేరుకుని అభిమాన హీరోని చూసేందుకు ఆసక్తి చూపించారు.  

నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది.

Updated at - Sep 29 , 2026 | 03:51 PM