Agadha: ‘అగధ’ చీకటి లోకం నుంచి పుట్టుకొచ్చిన శక్తి!

ABN, Publish Date - Aug 03 , 2026 | 01:09 PM

కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ‘అగధ' చిత్రం ట్రైలర్ సోమవారం విడుదలైంది

కామాక్షి భాస్కర్ల కీలక పాత్రలో ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అగధ.  శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అజయ్ కె.ఆర్. సమర్పిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్ ను సోమవారం విడుదల చేశారు. ‘అగధ.. అది ఒక మూఢ నమ్మకమయితే కాదు. చీకటి లోకంలో నుంచి పుట్టుకొచ్చిన ఒక శక్తి’ అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది.  ఈ  మిస్టిక్ డివైన్ థ్రిల్లర్ ఆగస్టు 14న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.   

Updated at - Aug 03 , 2026 | 01:19 PM