మెన్షన్‌ హౌస్‌ మల్లేష్‌: శోభనం రోజు షాకిచ్చిన భార్య

ABN, Publish Date - Feb 28 , 2026 | 08:35 PM

శ్రీనాథ్ మాగంటి, గ్రాయత్రి రమణ జంటగా బాల సతీశ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ (Mension House Mallesh). రాజేష్ నిర్మించారు. కామెడీ విలేజ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. మార్చి 6న ప్రేక్షకుల విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్‌ ను వదిలారు మేకర్స్. కొత్తగా పెళ్లయిన మల్లేష్‌కు శోభనం రోజు రాత్రి భార్య ఇచ్చిన షాక్‌ ఏంటి? దాని నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది ట్రైలర్ లో వినోదాత్మకంగా చూపించారు.

Updated at - Feb 28 , 2026 | 08:35 PM