Yash: 'టాక్సిక్' ఇంటెన్స్ రొమాంటిక్ సాంగ్ వచ్చేసింది
ABN, Publish Date - Jul 21 , 2026 | 12:17 PM
రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రం నుంచి రెండో పాట విడుదలయింది.
రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న 'టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' చిత్రం నుంచి రెండో పాట విడుదలయింది. 'మనసాగదే' అంటూ సాగే లిరికల్ వీడియోను మంగళవారం విడుదల చేశారు. ఇంతకు ముందు వచ్చిన 'తబాహీ' ప్రేమలోని ఉప్పొంగే ఉద్వేగాలను చూపిస్తే, 'మనసాగదే' మాత్రం ప్రేమలోని మరో కొత్త కోణాన్ని ప్రజెంట్ చేసింది. తనిష్క్ బాగ్చి, అర్స్లాన్ నిజామీ, ఫహీమ్ అబ్దుల్లా స్వరపరిచిన ఈ రొమాంటిక్ మెలోడీకి సిద్ధార్థ్ బస్రూర్ తన వోకల్స్ తో ప్రాణం పోశారు. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట తెలుగు వెర్షన్‌కు 'మనసాగదే' టైటిల్ తో రిలీజ్ చేశారు.
తెలుగు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు. ఇందులో నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కుతోంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళంతో పాటు పలు భాషల్లో డబ్ వెర్షన్లు విడుదల కానున్నాయి. ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Updated at - Jul 21 , 2026 | 12:32 PM