OM Glimpse: ‘గతాన్ని వదిలేస్తేనే.. భవిష్యత్తు బాగుంటుంది’

ABN, Publish Date - Sep 07 , 2026 | 03:23 PM

మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా ‘ఓం’ ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘ఓం’. రాజ్‌కుమార్‌ పెరియాసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మలయాళ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి కీలకపాత్ర పోషిస్తున్నారు. సాయి పల్లవి, శ్రీలీల నాయికలుగా  కనిపించనున్నారు. అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోమవారం మమ్ముట్టి పుట్టినరోజు సందర్భంగా ‘ఓం’ చిత్రబృందం ఆయన పాత్రకు సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. ఇందులో మమ్ముట్టి ‘కార్తికేయన్‌’ అనే శక్తిమంతమైన పాత్రలో కనిపించనున్నారు. ‘గతాన్ని వదిలేస్తేనే.. భవిష్యత్తు బాగుంటుంది’ అనే ఆసక్తికరమైన డైలాగ్‌తో గ్లింప్స్‌ ప్రారంభమవుతుంది. మమ్ముట్టి లుక్‌, ఆయన పాత్రను చూపించిన తీరు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది. మరి ఈ బర్త్‌డే స్పెషల్‌ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

Updated at - Sep 07 , 2026 | 03:30 PM