కన్‌ఫ్యూజన్‌లో శ్రీవిష్ణు...

ABN, Publish Date - Feb 24 , 2026 | 02:56 PM

కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీవిష్ణు 'విష్ణు విన్యాసం' అనే యూనిక్ ప్రాజెక్ట్‌తో అలరించబోతున్నారు. యదునాథ్ మారుతీ రావు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నయన్ సారిక ఇందులో హీరోయిన్. ఈ సినిమా నుండి తాజాగా మరో లిరికల్ వీడియో విడుదలైంది. 'కన్‌ఫ్యూజన్‌... కన్‌ఫ్యూజన్‌... ఇరగమరగ కన్‌ఫ్యూజన్‌' అంటూ రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను హీరోయిన్ వైఖరితో బుర్రతిరిగిన హీరో మందు తాగి పాడే పాటగా చిత్రీకరించారు. భాను దీనికి డాన్స్ కొరియోగ్రఫీ చేయగా, శరత్ సంతోష్ దీనిని పాడారు. ఈ చిత్రానికి రథన్‌ సంగీతం అందిస్తున్నారు. సుమంత్ నాయుడు నిర్మిస్తున్న ఈ సినిమా ఇదే నెల 27న విడుదల కాబోతోంది.

Updated at - Feb 24 , 2026 | 02:57 PM