ఇంత చేయగలిగిన ప్రపంచం.. ఎంతైనా చేయగలదు..

ABN, Publish Date - Apr 01 , 2026 | 06:21 PM

ప్రదీప్ రంగనాథన్ హీరోగా, విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ లవ్ స్టోరీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’., కృతి శెట్టి కథానాయిక. నయనతార నిర్మించిన ఈ సినిమాలో ఎస్.జె. సూర్య, యోగి బాబు కీలక పాత్రలు పోషించారు. బుధవారం హీరో రానా దగ్గుబాటి ఈ సినిమా తెలుగు టీజర్‌ను లాంచ్ చేశారు. 'ప్రపంచం ఎక్కడికో వెళ్లిపోయింది… మనం ఇప్పుడు 2040లో ఉన్నాం. కానీ ఒకడు లేని ఒక విషయాన్ని ఉందని అంటున్నాడు' అంటూ మొదలైన టీజర్ ఆసక్తికరంగా ఉంది. 'లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది ఇంకా ఉంది… ఈ అమ్మాయిని చూడగానే అర్థమైంది' అనే డైలాగ్‌తో ప్రదీప్ రంగనాథన్ ఎంట్రీ,  కృతి శెట్టిని వర్షంలో కలిసే సన్నివేశం—ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్‌గా కనిపించింది. శ్రీ పద్మిని సినిమాస్ ద్వారా  ఏప్రిల్ 10న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుంది.

Updated at - Apr 01 , 2026 | 06:24 PM