Funky: విశ్వ‌క్.. హిట్ కొట్టేలానే ఉన్నాడుగా! ఫంకీ.. ట్రైల‌ర్‌

ABN , Publish Date - Feb 07 , 2026 | 07:38 PM

విశ్వ‌క్ సేన్ , క‌యాదు లోహ‌ర్ జంట‌గా జాతిర‌త్నాలు ఫేం అనుదీప్ కేవీ తెర‌కెక్కించిన చిత్రం ఫంకీ.

Funky

విశ్వ‌క్ సేన్ , క‌యాదు లోహ‌ర్ జంట‌గా జాతిర‌త్నాలు ఫేం అనుదీప్ కేవీ తెర‌కెక్కించిన చిత్రం ఫంకీ. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నాగ‌వంశీ నిర్మించాడు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 13న థియేట‌ర్ల‌కు రానుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన గ్లింప్స్‌, పాట‌లు మంచి ఆద‌ర‌ణ ద‌క్కించుకున్నాయి. టీజ‌ర్ సైతం ప్ర‌జ‌ల్లోకి వెళ్లింది.

అయితే సినిమా విడుద‌ల‌కు ఇంకా నాలుగైదు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉండ‌డంతో శ‌నివారం ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ విష‌యానికి వ‌స్తే.. ఆరంభం నుంచి చివ‌రి వ‌ర‌కు సింగిల్ లైన‌ర్స్ తో ప‌రుగులు పెట్టించారు. ప్ర‌తి డైలాగు ఓ పంచ్ లానే పేలి జాతిర‌త్నాలు సినిమాను గుర్తు చేసింది. మీరూ ఓ లుక్కేయండి.

Updated Date - Feb 07 , 2026 | 07:38 PM