'తిమ్మరాజుపల్లి టీవీ' మూవీ నుంచి 'నిజమేనా' లిరికల్ సాంగ్ రిలీజ్

ABN, Publish Date - Apr 04 , 2026 | 09:32 PM

హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. వి. మునిరాజు తెరకెక్కించిన ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ డ్రామా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా శనివారం ఈ మూవీ నుంచి 'నిజమేనా' అనే లిరికల్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేశారు. వంశీకాంత్‌ రేఖన దీనిని కంపోజ్‌ చేయగా, సనరే ఈ పాటకు సాహిత్యం అందించారు. జయశ్రీ పల్లెం దీనిని పాడారు. 'నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా, నువు పలికిన ఆ మాటే పొరబడి విన్నానా, నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా కను తెరిచి నీ ముందే కలనే కన్నానా, ప్రతి క్షణం నీ వెంటే ఇన్నాళ్లుగా తిరిగానే, నేనేమిటో కొంచెం కూడా అర్థం కాలేదా...' అంటూ హృదయాన్ని హత్తుకునేలా పాట సాగింది. మీరూ చూసేయండి...

Updated at - Apr 04 , 2026 | 09:32 PM