'కింగ్‌డమ్‌' ఫేమ్‌ వెంకటేశ్‌తో బొమ్మక్ శివ సినిమా

ABN, Publish Date - Aug 20 , 2026 | 03:53 PM

విజయ్ దేవరకొండ హీరోగా రూపుదిద్దుకున్న 'కింగ్‌డమ్‌'తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మలయాళ నటుడు వెంకటేశ్‌ వి.పి.. ఇప్పుడు అతనికి తెలుగులో హీరోగా నటించే అవకాశం లభించింది. 'కె ర్యాంప్‌' వంటి సక్సెస్ ఫుల్ మూవీని నిర్మించిన బొమ్మక్‌ శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ నిర్మాణంలో ధీరజ్‌ న్యాతి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సురేశ్‌ తేజ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. దీనికి 'డి.జి.పి.' అనే వర్కింగ్‌ టైటిల్‌ ను పెట్టుకున్నారు.

వెంకటేశ్‌. వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 'సుడా సుడా ఇడ్లీ' అనే రెస్టారెంట్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. 'కింగ్‌డమ్' చిత్రంలో వెంకటేశ్‌ పోషించిన మురుగన్ పాత్ర నటుడిగా అతనికి మచి పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు డి.జి.పి. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్ట్ 20 హీరో వెంకటేశ్‌. వి.పి. బర్త్ డే సందర్భంగా ఆయనకు మేకర్స్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తమ సినిమాలోకి వెల్ కమ్ చెప్పారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వీడియో గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమాకు జ్ఞానీ సంగీతం అందిస్తున్నారు.

Updated at - Aug 20 , 2026 | 04:13 PM