వంద దేవుళ్లు: ‘ఇది కలనో’ అంటూ మెలోడీ సాంగ్
ABN, Publish Date - Apr 01 , 2026 | 05:14 PM
విజయ్ ఆంటోని, దర్శకుడు శశి కాంబోలో ‘వంద దేవుళ్లు’ అనే సినిమా తెరకెక్కుతోంది. స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు.విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ‘ఇది కలనో’ అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు భాగ్య శ్రీ అందించిన సాహిత్యం, శిభి శ్రీనివాసన్, శిరీష భాగవతుల ఆలపించారు. బాలాజీ శ్రీరామ్ అందించిన బాణీ శ్రోతల్నిఆకట్టుకుంటోంది.
Updated at - Apr 01 , 2026 | 05:14 PM