'హుషార్ పిట్టలు' నుంచి మరో పాట
ABN, Publish Date - Jul 15 , 2026 | 05:55 PM
అన్షు, వాసవి గణేశన్ జంటగా తెరకెక్కిన సినిమా 'హుషార్ పిట్టలు'. సెన్సార్ ఇక్కట్లను అధిగమించి, ఈ సినిమా ఆగస్ట్ 15న జనం ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మంగ్లీ పాడిన పాటను రిలీజ్ చేశారు.
అన్షు, వాసవి గణేషన్ జంటగా రూపొందుతున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం 'హుషార్ పిట్టలు'. వెంకట్ యాదవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి బిక్షు దర్శకుడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ సంస్థలు విడుదల చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ వీడియోస్ కు మంచి స్పందన లభించింది. తాజాగా మేకర్స్ 'టుంగ టుంగ...' అనే పాటను విడుదల చేశారు. ప్రముఖ గాయని మంగ్లీ పాడిన ఈ పాటను ఎస్.ఎస్.చిరంజన్ రాయగా, చరణ్ అర్జున్ స్వరపరిచారు. ఈ సినిమాను ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు.
Updated at - Jul 15 , 2026 | 05:55 PM