Happy Patel Khatarnak Jasoos: ఆమిర్‌ను బయటకు లాగేశారు

ABN, Publish Date - Jan 12 , 2026 | 05:04 PM

ఇమ్రాన్‌ఖాన్‌, ఆమిర్‌ఖాన్‌, మోనా సింగ్‌, షరీబ్‌ హష్మి తదితరులు కీలక పాత్రదారులుగా నటిస్తున్న చిత్రం ‘హ్యాపీ పటేల్‌: ఖతర్నాక్‌ జాసూస్‌’.  వీర్‌ దాస్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. జనవరి 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆమిర్‌ఖాన్‌ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సునీల్‌గ్రోవర్‌ చేసిన వీడియో నవ్వులు పూయిస్తోంది. ఆమిర్‌ఖాన్‌ గెటప్‌లో ఉన్న సునీల్‌ తనదైన సంభాషణలతో నవ్వులు పూయించారు. చివరిలో నిజమైన ఆమిర్‌ ఖాన్ రాగా, సెక్యురిటీ సిబ్బంది సాయంతో ఆయన్ను బయటకు పంపించడం ఫన్ రైడ్ లా ఉంది. 

Updated at - Jan 12 , 2026 | 05:13 PM