గరివిడి లక్ష్మీ సినిమా నుండి మరో జానపదం... 'కోసింది కొయగూర'!

ABN, Publish Date - Mar 25 , 2026 | 12:48 PM

ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన ప్రముఖ జానపద గాయని గరివిడి లక్ష్మీ కథను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై సినిమాగా నిర్మిస్తున్నారు. టైటిల్ రోల్‌ను ఆనంది పోషిస్తుండగా, గౌరి నాయుడు జమ్ము ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. బుర్రకథలు చెప్పడమే కాకుండా వాటిని ఉద్యమంగా మార్చిన లక్ష్మీ జీవితం తప్పని సరిగా ప్రేక్షకులను మెప్పిస్తుందనే ఆశాభావంతో ఉన్నారు నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్‌, కృతి ప్రసాద్. తాజాగా మేకర్స్ 'కోసింది కొయగూర' అనే జానపద గీతాన్ని విడుదల చేశారు. అనన్య భట్, షకలక శంకర్, గౌరీ నాయుడు జమ్ము ఈ పాటను పాడారు. ఉత్తరాంధ్ర జనపదం మూలం నుంచి స్వరపర్చిన ఈ పాటకు గంటేడ గౌరు నాయుడు, గౌరీ నాయుడు జమ్ము అదనపు సాహిత్యం అందించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో చక్కని స్పందన లభిస్తోంది. రెస్పాన్స్ వస్తోంది.

Updated at - Mar 25 , 2026 | 12:49 PM