టైటిల్ సాంగ్ వచ్చేసింది... వింటారా సరదాగా!
ABN, Publish Date - Mar 02 , 2026 | 03:49 PM
సూపర్ స్టార్ కృష్ణ మనవడు, ప్రిన్స్ మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) హీరోగా నటించిన మూడో చిత్రం 'వింటారా సరదాగా' (VISA). ఈ సినిమా నుండి 'అనగనగా అమెరికా' అంటూ సాగే టైటిల్ సాంగ్ విడుదలైంది. శ్రీ గౌరీ ప్రియ (Sri Gowri Priya) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఉద్భవ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజయ్ బుల్గానిన్ (Vijai Bulganin) స్వరాలు సమకూర్చిన ఈ సినిమాలోని టైటిల్ సాంగ్ ను సనారే రాయగా, సంజిత్ హెగ్డే పాడారు.
Updated at - Mar 02 , 2026 | 03:50 PM