Rapid Chitram: ప్రపంచ సినిమా సమాచార మాలిక
ABN , Publish Date - Aug 01 , 2026 | 02:26 PM
వివిధ భాషా చిత్రాలకు సంబంధించిన సినిమా సమాచారాన్ని సంక్షిప్తంగా అందించే సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఇంకెందుకు ఆలస్యం చూసేయండిక.
సినిమాలతో పాటు బిజినెస్‌లోనూ టాలీవుడ్ స్టార్స్ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే మహేశ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రవితేజ ఏసియన్ సంస్థతో కలసి మల్టీప్లెక్స్‌లు నిర్మించగా.. ఇప్పుడు ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా అదే బాటలో చేతులు కలపబోతున్నారట. ‘సైమా-2026’ నామినేషన్లలో టాలీవుడ్ సినిమాలు హవా చాటాయి. ‘మిరాయ్’ 11 నామినేషన్లతో టాప్‌లో నిలవగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘తండేల్’, ‘కోర్ట్’ తర్వాతి స్థానాలు దక్కించుకున్నాయి. ఈ అవార్డుల ప్రదానోత్సవం సెప్టెంబర్ 11, 12 తేదీల్లో జరగనుంది. దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ తెలుగు ట్రైలర్‌ను ఎన్టీఆర్ విడుదల చేశారు. కాసినో, బెట్టింగ్ స్కామ్ నేపథ్యంలో నహస్ హిదాయత్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్ట్ 20న థియేటర్లలోకి రానుంది. హర్షిత్ రెడ్డి, స్నేహ జంటగా నటించిన ‘దీవానా’ చిత్రం ఓటీటీలోకి వచ్చింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాటిట్యూడ్ మీట్‌లో తమ సినిమాకు సపోర్ట్‌గా నిలచిన మీడియా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు చిత్రబృందం ధన్యవాదాలు తెలిపింది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెర సీతమ్మల జర్నీ!
బర్త్‌డే స్పెషల్.. ‘టాక్సిక్’ రాయల్ లుక్‌లో కియారా!
సీనియర్ నటి మంజు భార్గవితో NSR స్పెషల్ ఇంటర్వ్యూ