Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Jul 31 , 2026 | 02:06 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆగస్ట్ 22న ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ పై అధికార ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఆలస్యం వల్ల వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని అక్టోబర్ 16న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ‘వారణాసి’ షూటింగ్ విరామంలో మహేశ్ బాబు‌తో కలసి ప్రియాంక చోప్రా దంపతులు చిల్ అవుతున్నారు. హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సినిమా చూసేందుకు వచ్చిన ఈ ముగ్గురూ లాంజ్‌లో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మణికట్టు శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న రామ్ చరణ్ కుటుంబంతో కలసి హైదరాబాద్ చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు కొన్ని వారాలు రెస్ట్ తీసుకోనున్న చరణ్.. ఆ తర్వాత చరణ్ షూటింగ్‌లో పాల్గొంటారు. అక్కినేని అఖిల్ నటించిన ‘లెనిన్’ మూవీ 100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ అద్భుత విజయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన మేకర్స్ రూ. 100 కోట్ల పోస్టర్‌ను అధికారికంగా రిలీజ్ చేశారు. ఇటు హిట్ జోష్‌లో ఉన్న అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పరశురామ్‌తో చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

Karmaakhya Movie reveiw: కర్మాఖ్య మూవీ రివ్యూ

సైమా 14వ ఎడిషన్‌ నామినేషన్స్‌లో ఈ తెలుగు చిత్రాలదే హవా..

మహేష్ సినిమాలో విలన్‌గా చేయాలని ఉంది: సుమంత్

Updated at - Jul 31 , 2026 | 02:06 PM