Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Aug 07 , 2026 | 01:53 PM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.
రామ్ చరణ్, సుకుమార్ కాంబో మూవీ త్వరలోనే మొదలుకానుంది. మణికట్టు సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటోన్న చెర్రీ త్వరలోనే షూటింగ్‌లో జాయిన్ కానున్నారు. ఇందులో ప్రముఖ కథానాయిక రుక్మిణీ వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ తర్వాత రస్టిక్ యాక్షన్ డ్రామా ‘ద ప్యారడైజ్’ టీజర్ విడుదలైంది. అభిమానుల అంచనాలను అందుకునేలా టీజర్ ఉండటం విశేషం. నాని మాస్ అవతార్‌లో మరోసారి ఆకట్టుకున్నారు. ‘వారణాసి’ షూటింగ్ సెట్ నుంచి 25 సెకన్ల బిహైండ్-ది-సీన్స్ వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం వీడియోను తొలగించింది. ఇదిలా ఉంటే మహేశ్ బాబు బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఇచ్చే ట్రీట్ కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ హీరోగా యదు వంశీ దర్శకత్వంలో నిహారిక నిర్మిస్తున్న సినిమా ‘బరి’. ఇందులో తొలిసారి వరుణ్ తేజ్‌తో పాటు నాగబాబు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఈ వార్తలపై కూడా ఓ లుక్ వేయండి:
Lenin OTT: లెనిన్.. ఓటీటీకి వచ్చేశాడు
Korean Kanakaraju: వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు రివ్యూ
Pradeep Rawat: కంట తడి పెట్టిస్తున్న ప్రదీప్ రావత్ తనయుడి మాటలు..
Updated at - Aug 07 , 2026 | 01:53 PM