Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Aug 19 , 2026 | 02:44 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

హ్యాట్రిక్ హిట్లతో జోరు మీదున్న వెంకీ అట్లూరి.. నాగ చైతన్య 25వ సినిమా తెరకెక్కిస్తున్నారట. చైతూ ‘వృషకర్మ’ పూర్తయిన వెంటనే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడట. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్‌ని నవంబర్ 10న గ్రీస్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. రశ్మిక గాయం ఎఫెక్ట్ తన హ్యాట్రిక్ చిత్రాల షూటింగ్స్‌ పై ప్రభావం చూపుతోంది. ఆరు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి రావడంతో ‘మైసా, రణబాలి, రాకా’ చిత్రాల షూటింగ్ దాదాపు 45 రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. సందీప్ కిషన్, జేసన్ సంజయ్ కాంబోలో వస్తున్న యాక్షన్ డ్రామా ‘సిగ్మా’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఈ వార్తలు కూడా చదవండి:

పెళ్ళైన మగాడితో అడ్డంగా దొరికిన ఫోక్ డ్యాన్సర్ మాధురి రాథోడ్...

Balakrishna: 'రాముడు - భీముడు' సినీ నిర్మాత మృతి

ఓటీటీకి వచ్చేస్తోన్న కల్ట్ క్లాసిక్ చెన్నై లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చు అంటే

Updated at - Aug 19 , 2026 | 02:50 PM