Rapid Chitram: సినిమా విశేషాల సంక్షిప్త సమాచారం ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Jun 18 , 2026 | 08:50 AM
తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్ చిత్రం. హాలీవుడ్, ఓటీటీ విశేషాలనూ ఇందులో వీక్షించొచ్చు.
అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన అభిమాని నిరంజన్‌ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వయంగా కలసి పరామర్శించారు. మళయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో జోరు పెంచారు. ఇప్పటికే రవి నెలకుడితి డైరెక్షన్‌లో ఓ సినిమాలో నటిస్తున్న ఆయన, ఇప్పుడు నాని వాల్ పోస్టర్ బ్యానర్‌లోనూ నటించడానికి ఓకే చెప్పారు. టీజీ T20 లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ ఎంపికయ్యారు. ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నూతన పాలకవర్గం విజయవాడలో తొలి బోర్డు సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించింది. యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వస్తున్న ‘ఆల్ఫా’ ట్రైలర్ విడుదలైంది.. ఇటువంటి మరింత సమాచారం తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి:
సోలో హీరోగా 400 కోట్ల క్లబ్‌లోకి రామ్ చరణ్.. ఆడు ‘పెద్ది’ సారొ!
మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ రిలీజ్.. ఈ సారైనా?
‘బెంగళూరు నాగరత్తమ్మ’.. సింగీతం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరపైకి తెచ్చేదెవరో..
Updated at - Jun 18 , 2026 | 08:56 AM