Rapid Chitram: సినీ వార్తా కదంబం ర్యాపిడ్ చిత్రం
ABN , Publish Date - Aug 09 , 2026 | 02:59 PM
టాలీవుడ్‌తో పాటు జాతీయ, అంతర్జాతీయ సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్ అప్‌డేట్స్‌కు చిరునామా. ఇంకెందుకు ఆలస్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ వార్తలను తెలుసుకోండి!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోలో రానున్న ‘గాడ్ ఆఫ్ వార్’ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సుబ్రహ్మణ్య స్వామి ఇతిహాసాల ఆధారంగా తెరకెక్కే ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ యోధుడిగా కనిపించనున్నారు. 2027 మార్చి తర్వాతే ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభించి, ఆ తర్వాత షూటింగ్ మొదలుపెట్టనున్నారు. వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కాంబోలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తో్న్న మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ నెల 20 నుంచి ‘గుంటూరు కారం’ సెట్‌లో ఓ మాస్ పాట చిత్రీకరించనున్నారు. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్, కీర్తి సురేశ్, కృతి శెట్టి పాల్గొననున్నారు. నాని-సుజీత్ ‘బ్లడీ రోమియో’లో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. మేకర్స్ చెప్పిన కథ నచ్చడంతో భాగ్యశ్రీ ఓకే చెప్పారని.. త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం. ‘శ్రీనివాస మంగాపురం’ ఫెయిల్యూర్‌ను డైరెక్టర్ అజయ్ భూపతి స్వీకరించారు. ఈ సినిమా ఫలితానికి పూర్తి బాధ్యత తనదేనని చెబుతూ త్వరలోనే అందరికీ నచ్చే మంచి చిత్రంతో తిరిగొస్తానని చెప్పారు. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని.. ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందన్నారు.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూడండి.
ఇవి కూడా చదవండి:
అందుకే చెత్త సినిమాల్లో నటించా: సీనియర్ నటి
‘స్పిరిట్’ అద్భుతంగా వస్తోంది - సందీప్ రెడ్డి వంగా
అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే..