Rapid Chitram: సంక్షిప్తంగా సినీ విశేషాలు ర్యాపిడ్ చిత్రం

ABN, Publish Date - Jul 18 , 2026 | 12:33 PM

తెలుగు సినిమా సమాచారంతో పాటు భారతీయ ప్రధాన భాషల సినిమా విశేషాలను అందించే న్యూస్ బులిటెన్ ర్యాపిడ్‌ చిత్రం. హాలీవుడ్‌, ఓటీటీ విశేషాలనూ ఇందులో సంక్షిప్తంగా వీక్షించొచ్చు.

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రూపుదిద్దుకుంటోన్న NBK111 సినిమాను క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. క్రిస్మస్, న్యూ ఇయర్ సెలవులను క్యాష్ చేసుకునేలా డిసెంబర్ 24 లేదా 25న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అక్కినేని వారసులు ‘తండేల్’, ‘లెనిన్’ చిత్రాలతో సాలిడ్ సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు అందరి కళ్ళు నాగార్జున వందో చిత్రంపై పడ్డాయి. రా కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మైల్‌స్టోన్ మూవీతో నాగ్ సైతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ హిట్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సమంతకు ఆమె ఫ్రెండ్స్ ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్‌కు భర్త రాజ్‌తో కలసి వెళ్లిన సామ్‌కు స్నేహితులంతా కలిసి సీక్రెట్‌గా సీమంతంను నిర్వహించారు. మెరూన్ కలర్ ట్రెడిషనల్ దుస్తుల్లో మెరిసిపోయిన ఈ జంట ఫోటోలు వైరల్‌గా మారాయి. వరుణ్ తేజ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’ నుంచి ‘రాస గుమ్మడి’ అంటూ సాగే సాంగ్ ఈనెల 19న విడుదలకానుంది. ఇందులో దక్షా నాగర్కర్ తన డ్యాన్స్‌తో అలరించనుంది.. ఇంకా ఇలాంటి సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

KJQ: ‘కింగ్ జాకీ క్వీన్’ రిలీజ్ ఖరారు.. ఎప్పుడంటే

చిరుకి వదినగా చేసినా.. నాగ్‌ ఫ్యామిలీతోనే బాండింగ్ ఎక్కువ: సుధ

ఫెడరేషన్‌‌కు షాకిస్తూ.. నిర్మాతలకు జానీ, సుమలత మాస్టర్స్ లేఖలు

Updated at - Jul 18 , 2026 | 12:54 PM