Rapid Chitram: సినీ సమాచార చిత్రమాలిక ర్యాపిడ్‌ చిత్రం

ABN, Publish Date - Jul 19 , 2026 | 04:40 PM

సినీ ఇండస్ట్రీలో ఏ మూల ఏం జరుగుతుందో తెలిపే సమాచార మాలిక ‘ర్యాపిడ్‌ చిత్రం’. టాలీవుడ్ టు హాలీవుడ్ ఫిల్మ్ అప్డేట్స్ ఇందులో చూడొచ్చు. ఆలస్యమెందుకు వీడియో చూసేయండిక!

రవి నంబూరి దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్‌స్టోరీ’ నుంచి ట్రైలర్ విడుదలైంది. క్యూట్ లవ్ స్టోరీగా రాబోతోన్న ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటించిన ‘ఓ సుకుమారి’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో మేకర్స్ సక్సెస్ మీట్‌ను నిర్వహించి ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రియాంక చోప్రా బర్త్ డే కానుకగా ‘వారణాసి’ నుంచి గ్లోబల్ బ్యూటీ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో ‘మందాకిని’గా నటిస్తోన్న దేశీగాళ్ బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్‌గా కనిపిస్తున్న పిక్‌ను విడుదల చేయగా.. నెట్టింట ట్రెండ్ అవుతోంది. సుమంత్-రాజేశ్ కర్ణ కాంబోలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘న్యూటన్స్ థర్డ్ లా’ నుంచి ‘ధమ్ ధమ్’ సాంగ్ విడుదలైంది. కృష్ణ చైతన్య రాసిన ఈ క్యాచీ లైన్స్‌కు సింజిత్ ఎర్రమిల్లి మ్యూజిక్ అందించగా.. ఎస్.పి. చరణ్ గానం చేశారు... ఇలాంటి మరిన్ని సినీ విశేషాల కోసం పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.

ఇవి కూడా చదవండి:

72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..

విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..

RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..

Updated at - Jul 19 , 2026 | 04:43 PM