Rapid Chitram: సినిమా సమాచార మాలిక ర్యాపిడ్ చిత్రం
ABN, Publish Date - Sep 09 , 2026 | 03:52 PM
తెలుగు సినిమా రంగంతో పాటు ఇతర భాషా చిత్రాలకు సంబంధించిన సినీ సమాచార మాలిక ‘ర్యాపిడ్ చిత్రం’. మరెందుకు ఆలస్యం.. తాజా సినీ అప్డేట్స్ ఏంటో తెలుసుకోండి.
యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ బర్త్‌డే సందర్భంగా.. మంగళవారం వరుసగా సినిమా అప్‌డేట్స్ వచ్చాయి. చిరంజీవి నటిస్తున్న ‘కాకా’ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ రాగా.. ‘ఇట్లు అర్జున’ నుంచి టీజర్ విడుదలైంది. అలాగే సంగీత్ శోభన్‌తో చేస్తున్న ‘అంతా రాములోరు చూస్కుంటారు’ నుంచి స్పెషల్ పోస్టర్ వదిలి అనస్వరకు విషెస్ తెలిపారు. రామ్ చరణ్, సుకుమార్ కాంబోలో రానున్న ‘RC17’ సినిమా పూజా కార్యక్రమాలను దసరాకు ప్లాన్ చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ లేదా డిసెంబర్‌లో ప్రారంభం కానుంది. భుజం సర్జరీ నుంచి కోలుకున్న ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్‌లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలైన ఈ కొత్త షెడ్యూల్‌లో టాకీ పార్ట్‌తో పాటు భారీ యాక్షన్ సీన్లను చిత్రీకరిస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ‘ఎపిక్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ యూత్‌ఫుల్ రొమాంటిక్ డ్రామా సెప్టెంబర్ 11న విడుదల కానుంది... ఇంకా ఇలాంటి సినీ అప్డేట్స్ తెలుసుకునేందుకు పై ర్యాపిడ్ చిత్రం చూసేయండి.
ఇవి కూడా చదవండి:
Mahendragiri Vaarahi: 'మురారి'కి దీనికి సంబంధం లేదు!
Karunas: ఇప్పుడు నాకు పెద్దగా మార్కెట్ లేదు! కానీ నాతో సినిమాకు రూ.7 కోట్లు ఖర్చు చేశారు
గురు స్వాములు, మాల ధారులను అవమానిస్తారా.. అయ్యప్ప భక్తులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
Updated at - Sep 09 , 2026 | 03:53 PM