తరుణ్ భాస్కర్‌తో టీ తాగిన ట్రంప్.. వీడియో వైరల్..
ABN, Publish Date - Apr 21 , 2026 | 01:18 PM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు (Donald Trump) టీ ఇచ్చిన తరుణ్ భాస్కర్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది ఇండియన్ టీ కాదు, ఇరాన్ టీ అని చెప్పడం.. అక్కడ ఈ సినిమా విడుదల చేయొద్దని ట్రంప్ ఆదేశించారంటూ సరదాగా సాగింది ఈ వీడియో. -ట్రంప్ తీసుకున్న ఓ నిర్ణయంతో యువకుడి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది.. అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘గాయపడిన సింహం’ (Gaaya PaddaSimham). మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 30నే ఓవర్సీస్ లో రిలీజ్ కానుంది. ఇరాన్‌లో మాత్రం ఇది విడుదల కావడం లేదని తెలుపుతూ తాజాగా ఏఐ వీడియోను క్రియేట్ చేసి ఫాన్స్ తో పంచుకున్నారు మేకర్స్. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు. ఫరియా అబ్దుల్లా ఆయనకు జోడిగా నటించారు.
Updated at - Apr 21 , 2026 | 01:26 PM